30-08-2025 04:57:39 PM
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లును రేపు సభలో ప్రవేశపెడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) వెల్లడించారు. అలాగే సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామని.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కూడా రేపు సభలో చర్చ ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇచ్చే నిర్ణయం స్పీకర్‌దేనని.. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే 4, 5 రోజుల తర్వాత సభ నడుపుతామని శ్రీధర్ బాబు తెలిపారు. గణేశ్ నిమజ్జనం, వరదల దృష్ట్యా సభను వాయిదా వేయాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు.