calender_icon.png 31 August, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయండి

30-08-2025 05:18:47 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణ మండల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రేపటి సమావేశాన్ని జయప్రదం చేయాలని పాల్వంచ రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కిలారు నాగేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్ కోరారు. శనివారం కొత్తగూడెం నియోజకవర్గ పార్టీ బాధ్యులు వనమా వెంకటేశ్వరరావు నివాసములో సన్నాహక సమావేశ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ...  బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల 10 వ తేదిన కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి దిశానిర్దేశంపై ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పాల్వంచ భద్రాచలం రోడ్డులోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది. 

ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులు  మాజీ పాల్వంచ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాథం, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ లు మాట్లాడుతూ కేటీఆర్  కొత్తగూడెం నియోజకవర్గ పర్యటన వచ్చేనెల 10 వ తేదీన ఉంటుందని ఈ పర్యటనలో భాగంగా కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ నాయకులతో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని,

ఈ సమావేశాన్ని జయప్రదం చేయడంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ భాధ్యులు వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన రేపు పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొంటారని, పాల్వంచ పట్టణ, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.