30-08-2025 05:19:27 PM
తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో ఘటన..
ఇబ్రహీంపట్నం: గణపతి విగ్రహంతో పాటు ఐదు తులాల బంగారాన్ని నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపల్(Turkayamjal Municipality) పరిధిలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం హస్తినాపురం ఓ గిరిజన కుటుంబ సభ్యులు వినాయక నిమజ్జనం చేసేందుకు తుర్కయంజాల్ మాసబ్ చెరువు వద్దకు వచ్చారు. కాగా విగ్రహానికి వేసిన ఐదు తులాల బంగారాన్ని పొరపాటున నిమజ్జనం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న మున్సిపల్ నోడల్ అధికారికి సమాచారం ఇవ్వగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో జేసీబీ సాయంతో చెరువులో నిమజ్జనమైన విగ్రహాలను వెలికి తీశారు. విగ్రహానికి ఉన్న ఐదు తులాల బంగారాన్ని మున్సిపల్ అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చాకచక్యంగా వ్యవహరించి తమ బంగారాన్ని కాపాడినందుకు మున్సిపల్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.