calender_icon.png 31 August, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే బ్రిడ్జిలో వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు వెళ్లకపోవడంతో ప్రజల ఆందోళన..

30-08-2025 05:22:03 PM

రాజంపేట (విజయక్రాంతి): రాజంపేట మండలం(Rajampet Mandal)లోని శివాయ పల్లి గ్రామంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో డ్రైనేజ్ వాటర్ వెళ్ళకపోవడం పట్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రాజంపేట మండలంలోని శివాయపల్లి గ్రామం నుండి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నీటితో నిండిపోవడం రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీకి సంబంధించి నీటిని వేరే విధంగా నీరు మళ్లించే పద్ధతి చేస్తే బాగుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలకైనా అంతరాయం కలుగుతుందని కాబట్టి దీనిపైన స్పందించి దీనిని మరమ్మత్తు చేయించాలని కోరుకుంటున్నారు.