30-08-2025 05:03:16 PM
వెల్దుర్తి,(విజయక్రాంతి): రైతులు పొద్దెక్కితే యూరియా బస్తా ల కోసం క్యూ లైన్ లో నిల్చుంటు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటూ ప్రభుత్వంపై మండిపడ్డ మెదక్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్. తను మాట్లాడుతూ గత ప్రభుత్వంలో, ఏనాడు కూడా ఒక్క రైతన్న యూరియా కోసం రోడ్ ఎక్కిన దాఖలాలు లేవని, ప్రజా ప్రభుత్వం అంటూ రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న రేవంత్ ప్రభుత్వం అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు యూరియా అందుబాటులోనే ఉంది యూరియా ఏక్కడ కూడా కోరతలేదు అంటున్నారు.కానీ పొద్దున లేస్తే ఏ గ్రామం, ఏ మండలంలో చూసిన రోడ్లపైనే రైతులు ఉండడం చాలా బాధాకరం అని అన్నారు. సరైన సమయంలో పంటకు యూరియా చల్లకపోతే పంట యేతకు రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి మండల పీఎసీసీఎస్ వద్ద శనివారం ఉదయం 6 గంటల నుంచే రైతులు పడిగాపులు కాశారు. వచ్చిన యూరియా లారీ అరకొరగా రావడంతో రైతులకు నిరాశ ఎదురైందని తాను మండిపడ్డారు.
600 బస్తాలు యూరియా మాత్రమే ఉన్నందున ఒకరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వచ్చిన రైతులలో సగం రైతులకు మాత్రమే 600 బస్తాల యూరియా సరిపోయింది. మిగిలిన రైతులు రెండు రోజులు నుంచి పీఏసీసీఎస్ దగ్గర పడిగాపులు కాస్తున్నా యూరియా లభించకపోవడం తో రైతులు ఆవేదన చెందారు. అని ప్రభుత్వంపై మండిపడ్డారు.