06-12-2024 10:02:35 AM
ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు
రాజేంద్రనగర్: మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పుప్పాలగూడలోని క్రిన్స్ గేటెడ్ కమ్యూనిటీ లోని ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హరీష్ రావుతో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు తెలుస్తుంది.