calender_icon.png 28 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరణుజొచ్చిన చాలు.. వారిక మా వాళ్లు

28-12-2025 12:22:59 AM

  1. భారత సంస్కృతిలో ఈ సంస్కారం.. ఒక విడదీయలేని భాగం 
  2. తీతువుపిట్టను కాపాడేందుకు వందలాది మంది ‘ప్రాణా’ర్పణ
  3. విభీషణుడి విషయంలోనూ రాముడి కరుణ అమోఘం
  4. హసీనాకు ఆశ్రయం వరకు ఎన్నో ఉదాహరణలు

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨7 : శరణు కోరివచ్చిన వారిని కాపాడటం భారతీయ సంస్కృ తిలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అది దేశం నుంచి ఒక విడదీయలేని భాగం. బం గ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభు త్వం డిమాండ్ చేస్తున్న తరుణంలో భారత్‌లో గతంలో జరిగిన అనేక సంఘటనలను మరోసారి సింహావలోకనం చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.

కేవలం ఒక గాయపడిన పక్షిని కాపాడటం కోసం వందల మంది ప్రాణాలిచ్చిన చరిత్ర భారత్‌ది. గుజరాత్‌లోని మూలీ ప్రాంతంలో 1474లో ఒక తీ తువు పిట్ట (రెడ్ వ్యాపిల్డ్ ల్యాప్‌వింగ్) వేటగాళ్ల వేటుకు గాయపడి తప్పించుకుని రాజ పుత్రుల వద్ద శరణు కోరింది. ఆ చిన్న పక్షిని రాజపత్రులు అక్కున చేర్చుకున్నారు. వేటగాళ్లు ఆ పక్షిని తమకు అప్పగించాలని కోర గా.. రాజవంశం అందుకు ససేమిరా అం టుంది.

అంతేకాదు.. వేట సాగించే తెగ నుం చి దాడులు ఎదుర్కొంంది. ఈపోరాటంలో దాదాపు 200 మంది సైనికులు వీరమరణం పొందడం గమనార్హం. కష్టకాలంలో ఉన్న వారికి భారత్ అండగా నిలుస్తుందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. అలాగే పావురాన్ని కాపాడటానికి తన శరీరంలోని మాంసాన్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి గాథ మనకు తెలిసిందే. రామాయణంలోనూ ఇలాంటి ఉదాహరణలు మనకు తారసపడతాయి.

విభీషణుడు తన శత్రువైన రావణుడి సోదరుడని తెలిసినా రాముడు అతడికి అండగా నిలబడ్డాడు. అలాగే నాటి రణథంబోర్ పాలకుడు హమీర్ దేవ్ చౌహాన్ కూ డా అల్లావుద్దీన్ సర్వసైన్యాధ్యక్షుడు మహమ్మద్ షాకు ఆశ్రయమిచ్చి, అతడిని తిరిగి అప్పగించలేమని తెగేసి ఏకంగా  సైన్యంతో యుద్ధానికి దిగాడు. చివరకు తన సామ్రాజ్యాన్ని, ప్రాణాలను కూడా ఫణంగా పెట్టా డు.

1959లో చైనా నుంచి తప్పించుకుని వచ్చిన టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్ ఆశ్రయమిచ్చింది. భారత్ దీంతో చైనాతో యుద్ధం కూడా చేయాల్సి వచ్చింది. అలాగే బంగ్లాదేశ్‌లో షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత కూడా షేక్ హసీనాకు భారత్ ఆరేళ్ల పాటు ఆశ్రయం కల్పించింది. గతేడాది బంగ్లా అల్లర్ల తర్వాత హసీనాకు మరోసారి భారత్ ఆశ్రయమిచ్చింది. ఈ ఘటనలన్నీ చూస్తే భారత్ కారుణ్యశీలత, దయాగుణం ఎంతగొప్పదో అంచనా వేయొచ్చు.