calender_icon.png 31 December, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ మాటలు అవాస్తవం

31-12-2025 01:05:49 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : సాగునీటి అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై మంగళవారం హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. సాగునీటి అంశంపై హరీశ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు.

సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం ఇప్పటికే దాఖలు చేశామని, జనవరి 5వ తేదీన పిటిషన్ విచా రణకు వస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ హరీశ్‌రావు సాగునీటి ప్రాజెక్టులపై అబద్ధపు ప్రచారం చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.