31-12-2025 01:05:38 AM
పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం పోటాపోటీ యత్నాలు
కొండూరి దారెటో..?
కరీంనగర్, డిసెంబరు 30 (విజయక్రాంతి): సహకార పరపతి సంఘాల ఎన్నికల విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుల నియామకంతో పాటు జిల్లా అధ్యక్ష, డైరెక్టర్ల నియామకం నామినేటెడ్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధానానికి శ్రీకారంచుట్టింది. సహకార వ్యవసాయ పరపతి సంఘాల పదవీకాలాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం పొడగిస్తూ వచ్చి ఈ నెల 19న కమిటీలను రద్దు చేసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతిలోపు నామినేటెడ్ పద్ధతిలో పరపతి సంఘాల పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 131 పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ పరపతి సంఘాలకు ఒక చైర్మన్ తోపాటు ఇద్దరు డైరెక్టర్లను, జిల్లాస్థాయిలో సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షు నితోపాటు ఆరుగురు డైరెక్టర్లను, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) కు చైర్మన్ తో పాటు ఆరుగురు డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిన భర్తీ చేస్తారు. సహకార పరపతి సంఘాల అధ్యక్ష పదవి, డైరెక్టర్ల కోసం నేతలు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బా బు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కు మార్, విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎ మ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గాల ఇంచార్జీలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి పరపతి సంఘాల నామినేటెడ్ పోస్టులను రిజ ర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభు త్వం చూస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ పరంగా ఇంచార్జి ఎవరు లేకపోవడంతో నేతలు అయోమయంలో పడ్డారు. మంత్రులను నమ్ముకోవడమా, ని యోకవర్గ ఇంచార్జిలుగా చెప్పుకుంటున్న నేతలను నమ్ముకోవడమా అర్థంకాక అయోమ యానికి లోనవుతున్నారు. కొందరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రా జేందర్ రావుపై ఆధారపడ్డా ఆయన పూర్తిగా భరోసా ఇస్తారా అన్న అయోమయంలో ఉ న్నారు. మరికొందరు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని నమ్ముకుని ప్రయ త్నాలు ముమ్మరం చేశారు.
- కొండూరి దారెటో..?
కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షునిగా 20 సంవత్సరాలపాటు పనిచేసిన ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుతం బీ ఆర్‌ఎస్ పార్టీలో ఉన్న కొండూరి రవీందర్ రావు కాంగ్రెస్లో చేరతారా, మౌనంగా ఉంటా రా అన్న చర్చ కొనసాగుతోంది. కొండూరి రవీందర్రావు టెస్కాబ్ కు కూడా చైర్మన్ గా వ్యవహరించారు. బ్యాంకు అభివృద్ధికి విశేష కృషి చేసిన కొండూరి రవీందర్ రావు సే వలు ఆగిపోయినట్లేనా లేక కాంగ్రెస్లో చేరి ఆ యన మళ్లీ పదవి దక్కించుకుంటారా అన్న చర్చ కొనసాగుతుంది. శనివారం కొండూరి రవీందర్ రావుకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆలింగనం చేసుకుని ఆయన సేవలను కొనియాడడం ఈ చర్చకు బలాన్ని చేకూర్చింది.