calender_icon.png 22 September, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హడావుడిగా మార్కింగ్.. ఆందోళనలో రైతులు

22-09-2025 12:34:16 AM

- సీతారామ కాలువ నిర్మాణంలో అయోమయం 

- భూములు ఇవ్వటానికి సిద్ధం ముక్కలు చేస్తే సహించం 

- మొండికుంట రైతుల హెచ్చరిక 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 21, (విజయక్రాంతి.)సాగునీటి సౌకర్యం వస్తుందని సంతోషించాలో... ఉన్న సాగు భూమి రెండు ముక్కలవుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నా రు. సీతారామ ప్రాజెక్ట్ కాలువకు భూములు ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్న, ఉన్న భూములను అర్థరహితంగా రెండు ముక్కలు చేయ డా నికి వ్యతిరేకిస్తున్నట్లు రైతుల స్పష్టం చేశా రు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మొండికుంట గ్రామంలో రెండు రోజుల క్రి తం సీతారామ ప్రాజెక్టు సర్వే అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకంగా రైతుల పొలాల నుంచి కాలువ నిర్మాణానికి మార్కింగ్ చేయడంతో రైతులంతా అవాక్కయ్యారు. గతంలో మార్కింగ్ చేసిన ప్రాం తాన్ని వదిలివేసి, కొత్తగా రైతుల పొలాల నడుము నుంచి కాలువ నిర్మాణానికి మా ర్కింగ్ చేయడంతో రైతులు వ్యతిరేకిస్తున్నా రు.

గ్రామంలో 60 మంది రైతులకు చెందిన భూమి సేద్యానికి పనికి రాకుండా కాలువ త వ్వుతున్నారంటూ మండిపడుతున్నారు. ఉ న్న భూమి రెండు ముక్కలు కావడంతో కా లువ ఇవతల నుంచి అవతలకు ఎలా వెళ్లి సేద్యం చేయాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి బో రు సౌకర్యాలు లేక అలమటిస్తున్న రైతులు, అనేక మార్లు బోరు పాయింట్లు పెట్టి నీళ్లు పడక నిరాశ చెందారు. అదృష్టవశాత్తు నీరుపడి బోరు ఆధారంగా సేద్యం చేస్తున్న రై తులకు సీతారామ ప్రాజెక్టు కాలువ గుదిబండగా మారింది. కాలువ నిర్మాణంలో బోర్లు సైతం కోల్పోతున్నామని వాపోతున్నారు.

నీ టి పారదల శాఖ జిల్లా అధికారులు, మం త్రులు క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. భూమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న, మిగులు భూమి సేద్యానికి అనువుగా ఉంటే నే తప్ప కాలువ నిర్మాణానికి భూమి ఇచ్చే ప్రసక్తి లేదంటూ హెచ్చరిస్తున్నారు. తమ సమస్యను చెప్పేందుకు ప్రయత్నించిన రైతులను సర్వేకు వచ్చిన అధికారులు వారికి అ ర్థం కాని పదం కాటూర్ లెవెల్స్ అంటూ భయాందోళనకు గురిచేస్తున్నారనీ వారు వాపోతున్నారు.

కాలవతవ్వితే ఏడు ఎకరాలు బిడే దిరిశల నాగయ్య (రైతు) 

గ్రామంలో సర్వేనెంబర్ 278/ ఈ,162/అ/1 లో మొత్తం మూడు ఎకరాల 8 గంటల భూమి ఉంది. ఆ అట్టి భూమిలో పామాయిల్ సాగు చేస్తున్నాను. సాగునీటి కొరకు 14 పాయింట్లు వేసినప్పటికీ బోరు పడలేదు. ఒక పాయింట్ వద్ద బోర్ పడింది. అట్టి బోరు ఆధారంగా పామాయిల్ సాగు తో పాటు, తనకు గల మరో నాలుగు ఎకరాల భూమిని సేద్యం చేస్తున్నాను. సీతా రామ ప్రాజెక్ట్ అధికారులు కాలువ నిర్మాణాన్ని తమ పొలం నుంచి తీయటమే కాకుండా, ఉన్న బోరు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అదే జరుగుతే తనకున్న ఏడు ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం ఉంది.

రైతులకు సమాచారం లేదు దొంతినేని వెంకటేశ్వరరావు (రైతు) 

సీతారామ ప్రాజెక్టు కాలువ కోసం గతంలో చేసిన మార్కింగ్ ను అర్ధాంతరంగా మార్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు రోజుల క్రితమే రైతుల భూముల నుంచి మార్కింగ్ చేపట్టారు. సర్వేనెంబర్ 17/1 లో రెండెకరాల భూమి ఉంది. ప్రస్తు తం పత్తి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నా ను. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం ద్వారా అర ఎకరం భూమి కోల్పోవలసి వ స్తుంది. మిగిలిన భూమి రెండు ముక్కలై సే ద్యం చేయడానికి అనువుగా లేకుండా పో తుంది. అధికారులు పునర్ పరిశీలించి రైతులతో చర్చించి కాలువ నిర్మాణాన్ని చేపట్టాలి.