calender_icon.png 9 January, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయన మాట నిలబెట్టుకున్నారు!

08-01-2026 12:59:08 AM

శర్వా హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథనాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య విలేకరులతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘-ఏజెంట్’ సినిమా జరుగుతున్న సమయంలోనే నిర్మాత అనిల్ నాతో మరో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఈ చిత్రంలో నిత్య పాత్ర కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్ నన్ను ఎంపిక చేశారు. ఈ కథ, నా పాత్ర చాలా నచ్చాయి. ఈ పాత్ర నాకు వ్యక్తిగతంగా చాలా రిలేట్ అవుతుంది. నిత్య ఇన్నోసెంట్‌గా కనిపించే అమ్మా యి. నిజాయితీగా వుంటుంది.  

ఈ సినిమాకు స్టోరీ ఈజ్ కింగ్. అందుకే స్క్రిప్ట్ విన్న వెంటనే సైన్ చేశా. దాదాపు నెల రోజులు వర్క్‌షాప్ చేశాం. నా పాత్ర గురించి ప్రతిదీ అర్థం చేసుకున్నా. తెలుగులో మాట్లాడటం ఒక బ్యారియర్. కాకపోతే డైలాగ్ విషయానికి వచ్చేటప్పటికి ముందే ప్రిపరేషన్ ఉంటుంది.  

ఈ సినిమా కోసం శర్వాతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. వెన్నెల కిషోర్, నరేశ్.. ఇలా చాలా మంచి కోస్టార్స్ ఉన్నారు. సంయుక్తతో నాకు చాలా మంచి కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. తను చాలా స్వీట్ పర్సన్. తను చాలా విషయాల్లో నాకు సహాయపడింది. 

నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ ప్రాక్టీస్ చేయడం లేదు. ఖాళీ సమయంలో బాగా చదువుతా. నిద్రపోతా (నవ్వుతూ). ఇక నా రాబోయే సిని మాలంటే.. -కొన్ని ప్రాజెక్టులు ఉన్నా యి. వాటి గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటి స్తారు.