19-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కా కుండా ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవడం వల్ల నే సివిల్ సర్వీసెస్ హోదాకు న్యాయం చేయగలిగిన వారుగా నిలిచిపోతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ)లో ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అధికారులు 10 వారాల శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న సం దర్భంగా ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంసీఆరె ఆర్డీ వైఎస్ చైైర్ పర్సన్ శాంతకుమారి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతిరోజు కార్యాలయాన్ని వదిలి వెళ్లే ముందు మిమ్ములని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.. మీ పని ద్వారా ఎవరి జీవితంలో అయినా ఒక మంచి మార్పు, గౌరవాన్ని తీసుకువచ్చిందా ప్రశ్నించుకోండి? అవును అని సమా ధానం వస్తే..
ఆరోజు మీరు ఎంత కఠినపరిస్థితుల్లో విధి నిర్వహణ చేసినా.. మీరు విజయం సా ధించినట్టేనన్నారు. విధి నిర్వహణలోమీరు నిర్లక్ష్యంతో తీసుకునే ఒక నిర్ణయం ఒకరి జీవితాన్ని ఏళ్లపాటు ప్రభావితం చేస్తున్నందున నిబద్దతతో విధి నిర్వహణ చేయాలని సూచించారు. ని జాయితీతో సేవ చేయాలని, ధైర్యంతో నిర్ణయాలు తీ సుకోవాలని, సానుభూతితో నాయకత్వం వహించాలని శిక్షణ అధికారులకు చెప్పారు.
పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’ : మంత్రి శ్రీధర్ బాబు
విశిష్ట అతిథి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘ఈ దేశం మీ నుంచి కేవలం పర్ఫెక్షన్ మాత్రమే ఆశించడం లేదు.. అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది’ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని డా.ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ తెలంగాణలో నిర్వహించిన ‘స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఏఐఎస్ అండ్ సీసీఎస్ ఆఫీసర్స్-2025’ ముగింపు వేడుకలకు ఆయన విశిష్ఠ అతిథిగా హాజరై మాట్లాడారు.
గవర్నెన్స్ అంటే కేవలం ఫైళ్లు, నిబంధనలు కాదని, అది ప్రజలతో మమేకమయ్యే ఒక హ్యూమన్ రిలేషన్ అని అన్నా రు. అధికారం, హోదా, ప్రొటోకాల్స్ అన్నీ తాత్కాలికమని.. ప్రజల జీవితాల్లో మీరు తీసుకొచ్చే సానుకూల మార్పు మాత్రమే శాశ్వతమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ స్వీయ నియంత్రణ పాటిస్తూనే.. నిజా యితీ, వినమ్రత, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గు డ్ గవర్నెన్స్’ సాధ్యమవుతుందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని అధికారులకు సూచించారు.