calender_icon.png 20 December, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరకరాని కొయ్యగా మారిన ఆ ఎమ్మెల్యే!

19-12-2025 12:48:19 AM

  1. కొరకరాని కొయ్యగా మారిన ఆ ఎమ్మెల్యే

తనదైన శైలిలో రాజకీయ అరంగేట్రం

అధిష్టానంలో అంతా అయినదే  హవా                                                                                    

నిజామాబాద్, డిసెంబర్ 18(విజయ క్రాంతి): ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న మహేష్ డైలాగ్ అక్షరాల ఆ ఎమ్మెల్యే కు సెట్ అవుతోంది. రాజకీయాల్లోకి ఎంట్రీతోనే ఎమ్మెల్యే అయ్యారు. ఏ విషయంలో నైనా అధిష్టానం వద్ద మాట నెగ్గించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులకు తగిన గుర్తింపు ఇస్తూ మాస్ లీడర్ గా పేరుతెచ్చుకుంటున్నారు. అయితే ఆ జిల్లాలోని సీనియర్ లీడర్లకు ఆ ఎమ్మెల్యే కొరకారాని కొయ్యగా మారాడు జూనియర్ వర్సెస్ సీనియర్స్ పొలిటికల్ వార్ కు అక్కడ తెర లేచింది.

ఉమ్మడి జిల్లా రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఎమ్మెల్యే గా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు. సీనియర్లను కాదని కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. హస్తం పార్టీలోనే జుక్కల్ కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు హ్యాండిచ్చినా మొక్కవోని ధైర్యంతో పోటీ చేసిన తోట గెలుపును ఆపలేకపోయారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటకకు బార్డర్ లో ఉంటుంది.

వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న జుక్కల్ లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే తేని నిధులు తోట రాబట్టుకున్నారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో జుక్కల్ లో ఏ ఎమ్మెల్యే తీసుకురాని నిధులు రెండేళ్లలో తోట తీసుకు వచ్చారన్న పేరుంది.  ఇదంత ఒకేత్తయితే. ఈ జూనియర్ ఎమ్మెల్యే తోట వ్యవహారం సీనియర్లకు మింగుడు పడటం లేదు.

అధిష్టానం వద్ద తోటకు ఉన్న ప్రాధాన్యం చూసి అవాక్కవుతున్నారు.  తోట స్పీడ్ కు జాహిరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ కు తెగ ఇబ్బంది పడుతున్నారన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. తోట చేస్తున్న పనుల్లో ఎంపీ శెట్కార్ అడ్డుపుల్ల వేస్తున్నారని ఎమ్మెల్యే బహటoగానే ఫీల్ అవుతు ఆరోపణలు చేస్తున్నారు.  కామారెడ్డి జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కొదవలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, సురేష్ షెట్కర్ వంటి ఉద్ధo డ నేతలు ఉన్నా ప్పటికిని అధిష్టానం వద్ద ఎమ్మెల్యే తోట మాటనే నెగ్గుతోండటం సీనియర్లకు మింగుడు పడటం లేదు.

ఇప్పుడు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్కిల్ లో అదే హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో భిన్నమైన పాలిటిక్స్ చేస్తూ నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. మార్కెట్ కమిటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించి సంచలం రేపారుతోట.  ఈ చర్య తో అందరి దృష్టిని అక్షరించారుతోట.  ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఇది సీనియర్లకు వారి అనుచర గణానికి మింగుడు పడటం లేదు.

మరోవైపు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలోనూ ఎమ్మెల్యే తోట తన పంతం నెగ్గించుకు న్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉన్నా సీనియర్లు తమ అనుచరులకు ఇప్పిoచుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అవి తోట పాలిట్రిక్స్ ముందు పని చేయలేదాంటే తోట పవర్ ఏంటో అర్థం అవుతోంది.     తన సొంత నియోజకవర్గం జుక్కల్ కు చెందిన మండల స్థాయి నాయకుడు తన అనుచరుడు ఏలే మల్లికార్జున్ కు డిసిసి పదవిని ఇప్పించారు ఎమ్మెల్యే తోట. ఈ వ్యవహారం సీనియర్లు పోచారం, సురేష్ శెట్కార్ కు ఏమాత్రం మింగుడు పడటం లేదంట.

తమ అనుచరులకు డిసిసి పీఠం సాధించటంలో సీనియర్లు ఫెయిల్ అయ్యారు. దింతో ఎమ్మెల్యే తోట మార్క్ పాలిటిక్స్ జిల్లాలో ప్రస్తుతం చర్చ నియాంశంగా మారింది. డిసిసి ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేతలు దూరంగా ఉండటం అక్కడ చర్చకు తెర లేపింది. కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు మల్లికార్జున 20 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నారు. 

తనకు అధిష్టాన పెద్దలతో ఉన్న ప్రత్యేక సంబంధాలతోపాటు ఈ అన్ని అంశాలను అనుకూలంగా మలుచుకుని అధిష్టానం వద్ద ఒప్పించారట ఎమ్మెల్యే తోట. పార్టీ విధేయునికి పెద్దపీట వేస్తే కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుందని అధిష్ఠాన పెద్దలను ఒప్పించారట ఎమ్మెల్యే తోట కార్యకర్తలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం తో అయన చేస్తున్న పనులు సీనియర్లకు మింగుడు పడటం లేదు.

అటు అభివృద్ధి నిధులు రాబట్టటం తోపాటు ఇటు పార్టీ కీలక పదవులు తన అనుచరులకు ఇప్పించటంలో సక్సెస్ అవుతు వస్తున్నారు తోట. సాయి పటేల్ వంటి యువ నాయకులను తోట అక్కున చేర్చుకుంటూ జుక్కల్ లో కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేస్తున్నారట ఇది ఎంపీ శెట్కార్ కు, సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తోందట. ఎమ్మెల్యే దూకుడు కి కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నాట్టు తెలుస్తోంది. అధిష్టానం వద్ద ఎమ్మెల్యే తోటకు ఉన్న ప్రాధాన్యం ముందు అవి పనిచేయక పోవడంతో నేతలు నిరాశ కలిగించింది.  రానున్న రోజుల్లో జూనియర్ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ల పాలిటిక్స్ ఎలా ఉండనున్నాయో చూడాల్సిందే.