23-12-2025 01:27:15 AM
కోదాడ, డిసెంబర్ 22: గొర్రెలు మేకల పెంపకందారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను త్రాగించే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31 వ తేదీ వరకు ముందస్తు షెడ్యూలు ప్రకారం పశువైద్యాదికారులు ,సిబ్బంది టీములుగా ప్రతీ గ్రామాన్ని సందర్శించి ఉచిత నట్టల నివారణ శిభిరాలు ఏర్పాటు చేసి జీవాలకు నట్టల నివారణ మందులు తాగిస్తారని, గొర్రెలు మేకల పెంపకం దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను జిల్లా పశువైద్యశాలగా మార్చాలని శాసన సభ్యుల వారికి జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి విన్నవించగా తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమములో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్దక అధికారి డా. దామచర్ల శ్రీనివాసరావు , AICC ఉపాధ్యక్షులు, సి హెచ్ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు, ఎర్నేని వెంకటరత్నం బాబు ,స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి.పెంటయ్య , పశువైద్యాధికారులు డా హరిత, డా సురేంద్ర,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ , మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,పట్టణ నాయకులు, సిబ్బంది రాజు చంద్రకళ, చిరంజీవి, ఖాన్ రాధాకృష్ణ పాల్గొన్నారు.