23-12-2025 12:00:00 AM
బుక్ ఫెయిర్‌లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి మాసపత్రిక సంయుక్త నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాం తి): ఎనిమిది బాలసాహిత్య కథల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి మాసపత్రిక సంయుక్త నిర్వహణలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్-2025 కొంపెల్లి వెంకట్‌గౌడ్ వేదికలో బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్బంగా వేదకుమార్ మాట్లాడుతూ.. పిల్లల నైపుణ్యాలను వెలికి తీసి వాటిని బాలచెలిమి పత్రికలో ప్రచురిస్తున్నామన్నారు.
అలాగే బాల చెలిమి గ్రంథాలయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 41 గ్రం థాలయాలను ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 100 గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో పెద్దలకు, పిల్లలకు, యువకులకు కథల పోటీలు నిర్వహించి వాటిలో ఎంపికైన ఉత్తమ కథలకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథి శాంతా సిన్హా మాట్లాడుతూ.. ఈ చిన్న పుస్తకాలు రావడం వెనక వేలాది మంది కృషి ఉందన్నారు. సోషల్ మీడియాకు పోటీగా బాల సాహిత్యాన్ని పెడుతున్నామన్నా రు.
ఆత్మీయ అతిథిగా పాల్గొన్న అసోసియేట్ ప్రొ.డా. రఘు పుస్తకాలను విశ్లేషిస్తూ బాగున్న కథలను, ఎనిమిది పుస్తకాలు మూడు తరాలకు సారథ్యం వహిస్తాయన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 30 ఏళ్ల కిందటి కంటే ఈనాడు బాల సాహిత్యం విరివిగా నాణ్యంగా వస్తోందన్నారు. కథ వస్తువులో మార్పు రావలసిన అవసరం ఉందన్నారు.
బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్.బాలాచారి వేదికను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలచెలిమి కన్వీనర్ గరిపెల్లి అశోక్, బిఎస్.రా ములు, చొక్కాపు వెంకటరమణ, ఆర్.వెంకటరెడ్డి రామ్ రాజ్, అమరవాది నీరజ, పైడిమర్రి గిరిజ, వి.ఆర్.శర్మ పాల్గొన్నారు.