23-12-2025 12:00:00 AM
అయిజ, డిసెంబర్ 22 : ఐజ మండలంలోని దేవ బండ గ్రామ శివారులో తప్పెట్ల మురుసు గ్రామస్తుల ఎండుమిర్చి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే తప్పెట్లమొరుసు గ్రామస్తులైన చింతలకుంట నర్సింహులు,చింతలకుంట పరమేష్ అను రైతులు ఎండు మిర్చి తెంపి పొలములో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తు లు సుమారు లక్ష 20 వేల రూపాయల (బెగడ రకం మిర్చి ధర సుమారు క్విం టాకు 40 లేదా 50 వేలు) విలువ గల ఎండు మిర్చి ఎత్తుకెళ్లారని రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. మూడురోజుల క్రితం బింగిదొడ్డిలో ద్విచక్ర వాహనాన్నీ తగలబెట్టడం చూస్తే శత్రువుల పన్నాగమా ? లేక దుండగుల దుశ్చర్యలా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని కొందరు స్థానికులు అనుకుంటున్నారు.