calender_icon.png 20 December, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శతక్కొట్టిన హెడ్

20-12-2025 02:02:04 AM

  1. పట్టుబిగించిన ఆస్ట్రేలియా

యాషెస్ సిరీస్ మూడో టెస్ట్

అడిలైడ్, డిసెంబర్ 19: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించిం ది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యా చ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (83) కు తోడు చివర్లో జోఫ్రా ఆర్చర్(51) హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగ లిగింది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3, బొ లాండ్ 3 , లియోన్ 2 వికెట్లు తీశారు. తర్వా త రెండో ఇన్నింగ్స్ లోనూ ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది.

ముఖ్యంగా ట్రావిస్ హెడ్ రెచ్చిపోయాడు. తన హోంగ్రౌండ్ లో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలోనే వెదరాల్డ్(1), లబూషే న్ (13) పరుగులకే ఔటవగా..ఖవాజా(40) రాణించాడు. తర్వాత హెడ్, అలెక్స్ క్యారీ కీలకమైన పార్టనర్ షిప్‌తో ఆసీస్ ఆధిక్యం మ రింత పెరిగింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ చేసి న క్యారీ రెండో ఇన్నింగ్స్ లో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.

వీరిద్దరూ ఐదో వికెట్ కు 122 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పా రు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ 4 వికెట్లకు 271 పరుగులు చేసింది. హెడ్ 142 (13 ఫోర్లు, 2 సిక్సర్లు), క్యారీ 52 (4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తు తం ఆస్ట్రేలియా 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో సెంచరీతో హెడ్ పలు రికార్డులను అం దుకున్నాడు. అడిలైడ్ ఓవల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా ఆసీస్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, అలన్ బోర్డర్, డేవి డ్ బూన్ సరసన హెడ్ నిలిచాడు.