calender_icon.png 20 December, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో యువ భారత్

20-12-2025 02:04:50 AM

  1. అండర్ 19 ఆసియాకప్

ఆదివారం పాక్‌తో టైటిల్ పోరు

దుబాయి, డిసెంబర్ 19: అండర్ 19 ఆసియాకప్‌లో భారత యువ జట్టు దుమ్మురే పుతోంది. టోర్నీ ఆరంభం నుంచీ వరుస విజయాలతో అదరగొడుతున్న భారత్ ఫైవ ల్‌కు దూసుకెళ్ళింది. సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సా ధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన లంకను భారత బౌలర్లు 138 పరుగులకే కట్టడి చేశారు. చమిక 42, కెప్టెన్ దిన్సారా 32, సేనివిరాత్నే 30 పరుగులతో పర్వాలేదనిపించారు. బౌలర్లలో హెనిల్ పటేల్ 2, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్‌లో భారత్ త్వరగా నే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఫాంలో ఉన్న వైభవ్ సూర్యవంశీ 9, ఆయుశ్ మాత్రే 7 పరుగులకే ఔటయ్యారు. అయితే హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ 58 (4 ఫోర్లు, 1 సిక్స్ ), విహాన్ మల్హోత్రా 61 ( 4  ఫోర్లు, 2 సిక్సర్లు ) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

వీరిద్దరూ మూడో వికెట్ కు 114 పరుగులు జోడించడంతో భారత్ అండర్ 19 జట్టు 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను పాక్ ఓడించిం ది. బంగ్లాదేశ్ 121 పరుగులకు ఆలౌటవగా.. పాక్ 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆదివారం టైటిల్ పోరులో భారత్, పాక్ తలపడనున్నాయి. లీగ్ స్టేజ్‌లో పాక్‌పై భారత్ ౯0 పరుగుల తేడాతో విజయం సాధించింది.