20-12-2025 12:34:58 AM
ముషీరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): క్రీడలు ఆరోగ్యకరమైన, చైతన్యవం తమైన సమాజానికి మూలస్తంభం అని భారత బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ విజేత పద్మభూషణ్ నైనా నెహ్వాల్ అన్నారు. క్రీడలలో పాల్గొనే విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణిస్తారని అన్నా రు. నగరంలోని డిఆర్‌ఎస్‌ఐఎస్ క్యాంపస్ లో శుక్రవారం జరిగిన డిఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 23వ వార్షిక క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలలో సైనా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడిషనల్ డిజిపి డా. అనిల్ కుమార్ డిఆర్‌ఎస్‌ఐఎస్ చైర్మన్ దయానంద్ అగర్వాల్, డైరెక్టర్ లు అంజనీ కుమార్ అగర్వాల్, సంజయ్ అగర్వాల్, గర్వ అగర్వాల్, స్పోరట్స్ చీఫ్ కోచ్ డా. మురమళ్ళ భారత్ కుమార్, అడ్మిన్ హెడ్ వినోద రంజన్, వైస్ ప్రిన్సిపాల్ పూజ సక్సేనా, హెడ్ ఆఫ్ బోర్డిం గ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్కూల్ క్యాంపస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బాడ్మింటన్ కోర్ట్ ఆమె ప్రారంభించి విద్యార్థులతో బాడ్మింటన్ ఆడారు.
అనంతరం క్రీడా పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ట్రోపీలు, కప్, సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్బంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ పాఠశాల స్పోర్ట్స్ డే కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తారని అన్నారు. పిల్లలలో క్రీడ లు, ఆటలను ప్రోత్సహించడంలో పాఠశాల లు భారీ పాత్ర పోషించాలన్నా రు.
డాక్టర్ అనిల్ కుమా ర్ మాట్లాడుతూ డిఆర్‌ఎస్‌ఐఎస్ యాజమాన్యం క్రీడల ప్రాముఖ్యత గుర్తించి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం అ భినందనీయమన్నారు. దయానంద్ అగర్వాల్ మాట్లాడుతూ పిల్లలు చిన్న వయస్సులోనే క్రీడల పట్ల ఆసక్తిని పెం పొందించుకోవడానికి డిఆర్‌ఎస్‌ఐఎస్ యాజమాన్యం మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు.