calender_icon.png 16 August, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్వరాలు తగ్గే వరకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలి: డిఎంహెచ్వో చంద్రశేఖర్

15-08-2025 11:54:30 PM

మునగాల,(విజయక్రాంతి): డెంగ్యూ వ్యాధులు, వైరల్ ఫీవర్ (జ్వరాలు) తగ్గే వరకు కలకోవ గ్రామంలో హెల్త్ క్యాంప్ కొనసాగించాలని రేపాల ప్రాథమిక వైద్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆదేశించారు. మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇటీవలే ఆరుగురికి డెంగ్యూ వ్యాధి వ్యాపించడంతో  గ్రామంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

వైద్య సిబ్బంది సర్వే ఆధారంగా జ్వరాల సోకిన  వారి ఇంటింటికి ఆయన వెళ్లి ఆరోగ్య పరిస్థితిని క్లుప్తంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రామంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్  నిర్వహిస్తుంది సద్విని పరుచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో వారం రోజులు పాటు డ్రైడే కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.