calender_icon.png 16 August, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన భారతావనికి పునరంకితమవుదాం

16-08-2025 12:00:00 AM

 - ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం

- జాతీయ పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

మహబూబ్ నగర్ ఆగస్టు 15 (విజయ క్రాంతి) : నూతన భారతావని కి పునరాంకితమవుతూ అభివృద్ధి దిశగా అతివేగంగా అ డుగులు వేద్దామని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జా తీయ పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక,సాంసృతిక శాఖ మంత్రి శ్రీ జూ పల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఎగరవేశారు. గౌరవ వందనం స్వీకరించిన అనంత రం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను పరిశీలించి జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా సంభాషించారు. పల్లె నుండి ఢిల్లీ దా కా ప్రతి పౌరుడు దేశ మాతకు అంకితమై, దేశ ప్రగతికి పునరంకితమయ్యే పవిత్రమైనరోజు అన్నారు.

పూజ్య బాపూజీ, పండిట్ నె హ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, వంటి సమర యోధుల, శాంతి దూతల త్యాగఫలమే ఈ రోజు వారి త్యాగ నిరతిని శ్లాఘి స్తూ, నూతన భారతావనికి పునరంకితమ య్యే రోజు. ఇది మన ప్రజాస్వామ్య భారతానికి 79వ పండుగ రోజని, ఈ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగస్వాములమవుతున్నందుకు మనమందరం సంబుర పడాల్సిన రోజు అన్నారు. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆనాడే మన అభివృద్ధికి బీజాలు పడ్డాయని, పంచవర్ష ప్రణాళికలు ప్రణాళికా బద్ద ప్రగతికి బాటలు వేశాయన్నారు. ప్రపంచ పటంలో అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల సరసన మన దేశం నిలిచిందని పేర్కొన్నారు.

అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికీ బాటలు పడ్డాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యే యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశయ సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్ర త్యేకంగా సంభాషించారు. ఈ వేడుకల లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస ప త్రాలను అందజేశారు. ఈ వేడుకలలో మ హబూబ్ నగర్ ఎం.పి డి.కి.అరుణ,శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్.పి.డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

తెలంగాణ ను ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం...

 వనపర్తి, ఆగస్టు 15 ( విజయక్రాంతి ) : తెలంగాణ రైజింగ్ 2047‘తో 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థి క వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అ భివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను చదివి వినిపించారు.

అ నంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుం బ సభ్యులను శాలువా తో సత్కరించారు. వే దికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖివెన్యూ నాయక్,  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య,  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు....70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి ‘సన్న బి య్యం‘ పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని జిల్లాలో కొత్తగా 17వేల 490 రేషన్ కార్డుల ను జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లా ప్ర జలందరికీ మరోసారి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అలరించిన సాంస్కృతికకార్యక్రమాలు

పాఠశాలల విద్యార్థుల ద్వారా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆ కట్టుకున్నాయి. అదేవిధంగా, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్సును ము ఖ్య అతిథి మహేందర్ రెడ్డి, కలెక్టర్, ఎమ్మెల్యే లతో కలిసి తిలకించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికా రులకు సిబ్బందికి ముఖ్య అతిథి ప్రశంసా ప త్రాలు అందజేసారు. జిల్లాలోని మెప్మా మ హిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు. అనంతరం గత విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన పద వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నగదు ప్రధానం చేశారు. 

మాజీ మంత్రి సింగిరెడ్డి 

వనపర్తి, ఆగస్టు 15 ( విజయక్రాంతి ) : ఆంధ్ర పాలకుల కుట్రలు,కబంధ హస్తాలనుండి తెలంగాణను విముక్తి చేసి సాగునీటి ప్రాజెక్టులు,వైద్య,విద్యా రంగాలలో సుస్థిర అభివృద్ధిని చేసి చూపెట్టింది కె.సి.ఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర శివారు లో గల జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం వద్ద స్థానిక బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ఆయన జాతీయ పతాకం ను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబ్ కాలము నుండి తెలంగాణ అభివృద్ధి కొనసాగిందని ఆయన కొనియాడారు. 10ఏండ్ల కె.సి.ఆర్ పాలనలో పెండిం గ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి గోదావరి నదీజలాలను సద్వినియోగ పరుస్తూ లక్షల ఎకరాలకు నీళ్లు అందించి వ్యవసాయ రం గాన్ని సస్యసామలం చేసింది కె.సి.ఆర్ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి పోచంపాడు ప్రాజెక్టు కింద మిగిలిపోయిన ఆయకట్టుకు ,ఉత్తర తెలంగాణకు సా గునీళ్లు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణను సస్యశామలం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వ్యయంతో నిర్మించినారని విమర్శించే కుహన మేధావి వర్గం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ రూ 82వేల కోట్లతో ఎ న్నో ఎత్తిపోతల ద్వారా చంద్రబాబు నిర్మించే బనకచర్లను ఎందుకు వ్యతిరేకించరని ఆయ న ఘాటుగా విమర్శించారు.

మరో స్వాతంత్ర పోరాటం మాదిరిగా ఉద్యమం నడిపి 10 ఏండ్ల అధికారంలో సాగు,తాగు,విద్యా, వై ద్యం రంగాలలో తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపినామన్నారు . కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లు అందించి పంజాబ్ తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల సాధించి రైతులను రాజులుగా మలిచింది బి.ఆర్.ఎస్ ప్ర భుత్వమన్నారు. 1948నుండి స్వాతంత్ర తె లంగాణను నిలకడ ఉండనివ్వకుండా రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేశాయని ఆయన ఆరోపించారు.దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నదని తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే మరోసారి కె.సి.ఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,తదితరులు పాల్గొన్నారు. 

 త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి & ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్ రెడ్డి

గద్వాల, ఆగస్టు 15 ( విజయక్రాంతి ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పో లీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి & ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎ.పి. జితేందర్ రెడ్డి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి, జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షే మం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు వివరాలను తన సందేశం ద్వారా తెలియజేస్తూ,భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, స్వాతంత్య్రం తరువాత పేదరికం, అస మానతలు,అస్పృశ్యతపై పోరాటం ప్రారంభించి ప్రజాస్వామ్య పునాదులు వేసినట్లు తెలిపారు. తెలంగాణలో సాగునీరు,పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం,కృష్ణా-గోదావరి వాటాల సాధనలో విజయాన్ని సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందని చెప్పారు.తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాన్ని గౌరవప్రదంగా ప్రపంచ వేదికపై నిలబెట్టే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం దేశభక్తి ఉట్టిపడేలా బాల భవన్, వివిధ పాఠశాలల విద్యార్ధులు సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా లో వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేసి ఉత్త మ సేవలు అందించిన అధికారులకు ప్రశం సా పత్రాలు అందజేశారు.అంతకు ముందు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘ నంగా నివాళు అర్పించారు. ఈ కార్యక్రమం లో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజ యుడు, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జి ల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య యువజన క్రీడా సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి 

నారాయణపేట.ఆగస్టు 15(విజయక్రాంతి): 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడు కల్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య యువజన క్రీడా సర్వీసుల శాఖామంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితూ ఎంతోమంది త్యాగధనుల ప్రాణత్యాగాల వల్ల సి ద్ధించిన స్వాతంత్రం నేడు మనం స్వేచ్ఛ వా యువును పీల్చుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన సాగిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన ఆరు పథకాల వల్ల ప్రజలకు ఎంతో లబ్ధి చే కూరిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఉ ద్యోగ ధర్మంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎమ్మెల్యే చిట్టెం పరి ణికా రెడ్డి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వా ర్,ఎస్. పి. యోగేష్ గౌతమ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణ య్ కుమార్, మార్కెటింగ్ చైర్మన్ శివారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, డీఎ స్పీ నల్లపు లింగయ్య, ఆర్డీవో రామ్ చందర్, జిల్లా అధికారులు, పరేడ్ కమాండర్ ఆర్‌ఐ నరసింహ సీ ఐ లు, ఎస్త్స్రలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ రూరల్ 15 : సామాజికంగా అందరు అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సం దర్భంగా జాతీయ జెండాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎగరవేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాలతో స్వాతంత్రము వ చ్చిందన్నారు. స్వాతంత్రము వచ్చి 79 యేం డ్లు అయితున్న ఇంకా అత్యాచారాలు, వరకట్న వేధింపులు, కులాల పట్ల వివక్ష.. అస మానతలు కనిపిస్తున్నాయి.. బాధ కలుగుతుంది..వీటిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న ,మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూ బ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గిరిధర్ రెడ్డి గణే ష్, అనంత రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసు లు, నవకాంత్, రామలక్ష్మణ్, అన్వార్ పాష, నరేందర్, మోసిన్ ఖాన్ పాల్గొన్నారు.

టీజీవో కార్యాలయంలో  

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలోని టీజీవో కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీ వో జిల్లా అధ్యక్షులు ఎస్ విజయకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో నేతలు ఈ కార్యక్రమము లో జిల్లా కార్యవర్గ సభ్యులు అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎమ్.యాదగిరి, సెక్రటరీ కె.వరప్రసాద్, ట్రెజరర్ శకె.టైటస్ పాల్ , వైస్ ప్రెసిడెంట్ లు ఎల్.తానాజీ, బి.రాంపాల్, సీనుగౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఎన్.గంగాధర్, ఆఫీస్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

శ్రీరంగాపురం, ఆగస్టు 15.మండలంలోని అన్ని గ్రామాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వ హించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను రంగు రంగు జెండాలతో శోభాయమా నంగా తీర్చిదిద్దుకుని జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఎందరో మహానుబావుల త్యా గాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు.దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నా రు.

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు గొప్ప కీర్తి సంపాదించి పెట్టాలని చెప్పారు. జెండా వందనం సందర్భంగా పాఠశాల విద్యార్థుల ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. వివిధ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొం దిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరు లు పాల్గొన్నారు.