calender_icon.png 16 August, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కెనపల్లి పెద్దవాగుపై చెక్ డ్యామ్‌కు జలకళ

16-08-2025 12:00:00 AM

నంగునూరు, ఆగస్టు 15: భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. నంగునూరు మండలం అక్కెనపల్లి పెద్ద వాగులో గంగమ్మ తల్లికి పూలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో సిద్దిపేట జిల్లాలో నిర్మించిన చెక్ డ్యామ్లు నేడు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతూ మత్తడి దుంకడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పదేళ్ల క్రితం తాగునీటి కోసం మహిళలు పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామాలకు సైతం మంచినీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. చెక్ డ్యాములు,కుంటలు నిండటంతో పశువులు, పక్షులకు కూడా నీటికొరత తీరిందని, తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు.