calender_icon.png 9 October, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ఏవైనా ఎగిరేది బీజేపీ జెండానే

09-10-2025 07:02:35 PM

బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఎన్నికలు ఏవైనా ఎగిరేది బీజేపీ జెండానేనని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుల్తానాబాద్ మండల రూరల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలువురు బిజెపి పార్టీ శ్రేణులు పాల్గొని మాట్లాడుతూ, 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఒరిగింది ఏమి లేదని ప్రజలు విసిగి వేసారిన అనంతరం మార్పు కోరి అరిచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ కు అవకాశం కల్పిస్తే రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తిగా వైపల్యం చెందిందని కాంగ్రెస్ పాలనలో అవగాహన లేని మంత్రులు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారే తప్ప రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలు అమలు పరిచింది లేదని హామీలు అటకెక్కించారన్నారు.

కార్యకర్తలు సైనికుల పనిచేసి ప్రతి గడపగడపకు బీజేపీ ప్రచారాన్ని తీసుకువెళ్లి బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని  మోడీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని కార్యకర్తల గెలుపు కోసం మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మీసా అర్జున్ రావు, సీనియర్ నాయకులు గొట్టేముక్కల సురేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, చౌదరి మహేందర్ యాదవ్, శాతరాజు రమేష్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కామణి రాజేంద్రప్రసాద్, వేగోళం శ్రీనివాస్ గౌడ్, వేల్పుల రాజన్న పటేల్, కొమ్ము చిన్న తిరుపతి యాదవ్, లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.