calender_icon.png 9 October, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభినందించిన ఏసిపి

09-10-2025 06:55:57 PM

అర్మూర్ (విజయక్రాంతి): ఫోన్ పే ద్వారా పొరపాటున డబ్బులు క్రెడిట్ కాగా ఆ డబ్బులను తిరిగి చెల్లించిన వారిని గురువారం అర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. ఈ నెల ఐదున హైదరాబాద్ అశోక్ నగర్ కు చెందిన గిరి విజయ లక్ష్మి తనకు 66 వేలను పంపమని తన స్నేహితులకు తన సెల్ ఫోన్ నెంబర్ 9848321289 ఇచ్చాడు. వారు 9848321289 బదులుగా 9848321389 అనే నెంబర్ కు 66 వేలను పంపారు. తదుపరి సెల్ నెంబర్ చెక్ చేసుకోగా అట్టి సెల్ నెంబర్ అర్మూర్ పట్టణానికి చెందిన నూతుల సత్తమ్మ గుర్తించారు. బాధితులు గురువారం ఆర్మూర్ ఏసీపీని కలవగా స్పందించిన ఆయన నూతుల సత్తమ్మ పిలిపించి విచారించగా సత్తమ్మ తనకు పొరపాటున రూపాయలు వచ్చినట్లు అంగీకరించారు. సత్తమ్మ తిరిగి గిరి విజయ లక్ష్మికి ఫోన్ పే ద్వారా రూపాయలు 66 వేలను చెల్లించినందున ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ లు అభినందించారు. విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.