calender_icon.png 9 October, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పి.డి.ఎస్.యు సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

09-10-2025 06:58:46 PM

అర్మూర్ (విజయక్రాంతి): పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్, ప్రభుత్వ కళాశాల పాఠశాలలో నాయకులు సభ్యత కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్, ఏరియా అధ్యక్షులు నిఖిల్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ విప్లవ ధృవతార జార్జిరెడ్డి కలలుగొన్న సమాజం వైపు ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని, వారి ఆశయాల సాధనకోసం కృషి చేయాలని అన్నారు. శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలని తెలియజేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ కళాశాల పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యార్థి సంఘంలో సభ్యత నమోదు చేసుకొని నూతన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వాళ్ళు పిలుపునిచ్చారు. బహిరంగ సమస్యలపై విద్యార్థి సంఘం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని విద్యార్థులు తమతో కలిసి అన్యాయాన్ని ఎదిరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఏరియా కోశాధికారి రాజు నాయకులు వినయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.