09-10-2025 06:46:04 PM
బాన్సువాడ (విజయక్రాంతి): రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13 వ వార్డు కాంగ్రెస్ యువ నాయకులు మహమ్మద్ గౌస్ గురువారం దర్శించుకుని సూఫీ సర్మత్ సుల్తాన్ ఉల్ హింద్ ఖాజా గరీబన్నవాజ్ దర్గాలో దువా చేయడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలకు మంచి చేసేలా అల్లా చల్లగా చూడాలని ఆయన మొక్కినట్లు తెలిపారు. ఈ విధంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం బాన్సువాడ ప్రజలపైన ఉండాలని కోరుకువడం జరిగింది. ఆయన వెంట మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.