calender_icon.png 9 October, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

09-10-2025 06:34:20 PM

దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు..

కోదాడ: మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండలం, పెద్ద మోదుగుపల్లి గ్రామానికి చెందిన కనగాల కోటయ్య తులసమ్మ కుటుంబ సభ్యులు గురువారం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు అన్నదానం నిర్వహించే దాతలు ముందుగా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. దేవాలయ కమిటీకి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కనకాల కోటయ్య తులసమ్మ దంపతులు కుమారుడు పుల్లారావు, రజిని, లహరి, అల్లుడు రవితేజ, శ్రావణి, ఆర్వీలు దాతలుగా వ్యవహరిస్తూ అనదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారావు, శరభయ్య, ఆదినారాయణ, రమేష్, రామారావు, సుబ్బారావు, గురవయ్య, ఏదులాపురం శ్రీనివాస్ రావు, సాయి శర్మ, శేషు తదితరులు పాల్గొన్నారు.