calender_icon.png 9 October, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగువేరా స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి

09-10-2025 06:41:14 PM

వనపర్తి టౌన్: ప్రపంచ విప్లవయోధుడు సోషలిస్టు సమాజం కోసం పోరాడి ప్రాణాలర్పించిన చేగువేరా స్ఫూర్తితో సిపిఐ నేతలు కార్యకర్తలు ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు కోరారు. గురువారం వనపర్తి సిపిఐ ఆఫీస్ లో చేగువేరా 58వ వర్ధంతి సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ గా మంత్రిగా విప్లవకారుడిగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ప్రజా పోరాటంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సాధించారని, ఆయన సోషలిస్టు సమాజ ఆశయ సాధన కోసం పనిచేయాలన్నారు.

చేగువేరాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఇప్పటికీ ఉన్నారంటే ప్రజల కోసం ఆయన సాగించిన పోరాటం చేసిన త్యాగాలే కారణమన్నారు. ఆస్ఫూర్తితో అందరం పని చేయాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాథం, జిల్లా నేతలు జ్యోతి రూప సుప్రియ సిపిఐ నేతలు అంజి కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.