calender_icon.png 9 October, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటి చెట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి..

09-10-2025 06:32:14 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): గీతా పారిశ్రామికుల జీవన ధారమైన తాటి చెట్లను తొలగించిన వ్యాపారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని గీత కార్మిక సంఘం నాయకులు గురువారం డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామానికి చెందిన గీత కార్మికులు అనాదిగా గీత వృత్తిని నమ్ముకుని తాటి ఈత చెట్లు గీస్తూ జీవనాధారం పొందుతూ బతుకున్నారు. ఈ మేరకు గౌడ సంఘం నాయకులు స్థానిక ఎక్సైజ్ సీఐ గురునాథ్ కు, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని నిందితునిపై చర్యలు తీసుకొని, గీతా కార్మికులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చేయాలని, అదే విధంగా బాధితుడికి తగిన శిక్ష పడేవిధంగా చర్య తీసుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గుర్రం సంపత్ గౌడ్, సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాగిరి అంజి గౌడ్, రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి ఇల్లందుల అంజిబాబు గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు జక్కే విష్ణువర్ధన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు మహేష్ గౌడ్, జిల్లా యూత్ కార్యదర్శి అఖిలేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి గుర్రం మల్లేష్ గౌడ్, కాల్వ శ్రీరాంపూర్ మండల నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు గౌడ్, స్థానిక గౌడ సంఘం నాయకులు బండి సర్వయ్య గౌడ్, బండి మల్లికార్జున్ గౌడ్ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు, స్థానిక సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది.