09-10-2025 06:48:37 PM
నిర్మల్ రూరల్: జిల్లాలో లింఫాటిక్ ఫైలేరియా వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేపై గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వైద్యాధికారులకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కు ఆరోగ్య పర్యవేక్షకులకు మహిళా ఆరోగ్య సహాయకులకు ఆశా కార్యకర్తలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జిల్లాలో లింఫోటిక్ ఫైలేరియా వ్యాధి ప్రసరణను తెలుసుకునేందుకు ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.
సర్వే అనంతరం ఫైలేరియా వ్యాధి వ్యాప్తి తగ్గిందా లేదా అన్నది తెలుస్తుందని, తద్వారా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది తెలుస్తుందని తెలియజేశారు. ఎంపిక చేయబడిన గ్రామాలలో 20 సంవత్సరాల పైబడిన ప్రజలకు ఫైలేరియా పరీక్ష స్ట్రిప్స్ ద్వారా రక్తాన్ని పరీక్షించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ శిక్షలను సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమా నిర్వాహణాధికారి డాక్టర్ ప్రత్యూష డాక్టర్ ఆశిష్ రెడ్డి, డాక్టర్ రాజా రమేష్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్ జిల్లాలోని వైద్యాధికారులు ఆరోగ్య పర్యవేక్షక అధికారులు పాల్గొన్నారు.