calender_icon.png 9 October, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ అదృశ్యం

09-10-2025 06:51:10 PM

అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ పట్టణం మామిడిపల్లిలో నివసించే బొమ్మన జలజ అదృశ్యమైనట్లు అర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. గత నెల 11న తన స్నేహితురాలి ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటిలో నుండి బయలుదేరి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. బంధువుల ఇళ్లలో స్నేహితులను అడిగిన కూడా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె తల్లి గంగా లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎవరికైనా అచూకీ తెలిస్తే సీఐ 8712659858, ఎస్ఐ 8712578207 నంబర్లలలో సంప్రదించాలని కోరారు.