calender_icon.png 26 October, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాట్సాప్ డీపీగా పోలీస్ కమిషనర్ ఫొటో

26-10-2025 12:00:00 AM

  1. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
  2. అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : సాధారణ ప్రజలనే కాదు, ఏకంగా నగర పోలీస్ బాస్‌నే సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఫొ టోనే వాట్సాప్ డీపీగా పెట్టి, ఆయనకు తెలిసిన వారికే సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చిం ది. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్ శనివారం వెల్లడించారు.

ఈ తరహా నకిలీ ఖాతాలు, మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అత్యం త అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.సైబర్ నేరగాళ్లు తన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించుకుని తెలిసిన వారికి వాట్సాప్ సందేశాలు పంపుతు న్నట్లు తన దృష్టికి వచ్చిందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు తన పేరుతో వచ్చిన ఒక నకిలీ సందేశం స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన పంచుకున్నారు.

జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు. వాట్సాప్‌లో డీపీగా నా ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వ చ్చింది. ఇవి నకిలీ ఖాతాలు, పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పం దించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి’ అని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరా లను, ఓటీపీలను అపరిచితులతో పంచుకోవద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఎవరైనా డబ్బులు అడిగితే అసలే పంపవద్దని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా మనల్ని మనమే కాపాడుకోవాలని, మీ జాగ్రత్తే అడ్డుకట్ట అనే విష యాన్ని మర్చిపోవద్దని తెలిపారు. ఇలాంటి నకిలీ వాట్సాప్ ఖాతాల నుంచి సందేశాలు వస్తే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.