20-11-2025 12:05:45 AM
విశాఖ వైద్య చరిత్రలో మరో మైలురాయి
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): 54 ఏళ్ల వ్యాపారవేత్తకు గుండె మార్పిడి చేసి, విశాఖలో కేర్ హాస్పిటల్స్ వైద్యులు మరో వైద్య అద్భుతాన్ని నమోదు చేశారు. సదరు వ్యక్తి పత్రో టిసిఎంపి వ్యాధి తో బాధపడుతూ, పదేపదే వెంటిక్యులార్ టాకీకార్డియా వచ్చే సమస్యను ఎదుర్కొన్నారు. ఈ కారణంగా కేర్ హాస్పిటల్స్‌లో ఆయనకు ముందే ఏఐసిడి (ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్) ఇంప్లాంటేషన్ చేశారు.
అనంతరం, ఆయన ఆరోగ్య పరిస్థితికి తుది చికిత్సగా హృదయ మార్పిడి కోసం జీవందానంలో నమోదు చేశారు. అక్టోబర్ 26న జీవన్ దాన్ ద్వారా శ్రీకాకుళంలో రోగికి సరిపోయే దాత గుండె లభించింది. వెంటనే ఆసుపత్రి బృందాలు, పోలీసు శాఖ సమన్వయంతో ఆ అవయవాన్ని జిల్లాల మధ్య అత్యంత వేగంగా రవా ణా చేశారు. అనంతరం, కేర్ హాస్పిటల్స్‌లోని ఇంటర్నల్ కార్డియో థొరాసిక్, వాస్క్యులార్ సర్జరీ బృందం ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.
ఈ ఆపరేషన్కు డా.ఎల్. విజయ్ మార్గదర్శకత్వం వహించగా, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి వి రావు నేతృత్వంలోని - కార్డియాలజీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వేణు గోపాల్ నేతృత్వంలోని - నెఫ్రాలజీ, కార్డియాక్ అనస్థీషియాలజీ విభాగాల నిపుణు లు జట్టుగా కలిసి పనిచేశారు. అనంతరం, ఆయనను 2025 నవంబర్ 6న ఆరోగ్యపరంగా స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశారు.