calender_icon.png 20 November, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర గ్రంథాలయంలో ముగ్గుల పోటీలు

20-11-2025 12:05:33 AM

మంచిర్యాల, నవంబర్ 19(విజయక్రాం తి): 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముగ్గుల పోటీ లు నిర్వహించారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మెహందీ కార్యక్ర మం నిర్వహించారు.ముఖ్య అతిథిగా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ హాజరై పోటీలను పరిశీలించారు. న్యాయ నిర్ణేతలుగా జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయురాళ్ళు శోభ, రజనీలు వ్యవహరించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కృతిన్, గ్రం థ పాలకులు ఎస్ మురళి, ఎస్ రామారావు,  సంపత్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.