calender_icon.png 25 May, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో భారీ వర్షం

24-05-2025 07:24:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం దంచికొడుతోంది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కురుసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, కృష్ణానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, యూసుఫ్ గూడ, అటు లక్డీకపూల్, సరూర్ నగర్, హిమాయత్ నగర్, చార్మినార్, ఉప్పల్, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, ముసీరాబాద్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ఎస్.ఆర్. నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

గత కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా పగటి పూట ఎండ ఉంటూనే సాయంత్రం కాగానే వర్షాలు ముంచెత్తున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక బంగాళాఖాతంలో శక్తి తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.