09-09-2024 12:17:03 AM
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 8: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వాన దంచి కొట్టింది. ఆదివారం రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, శంషాబాద్, మణికొండ ప్రాంతా ల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదమ నీరు చేరింది. మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్ చౌరస్తాలో భారీగా వరదనీరు నిలిచింది. ట్రాఫిక్ పోలీసులు వాటర్ లాగింగ్‌ను తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.