calender_icon.png 17 January, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్యాన్ని చిన్న చూపు చూడకండి

17-01-2026 02:45:13 AM

ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు

బెజ్జూర్, జనవరి 16, (విజయ క్రాంతి): ప్రభుత్వ వైద్యాన్ని చిన్నచూపు చూడకండి అని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి  హరీష్ బాబు అన్నారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణ లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దంత వైద్య శిబిరాన్ని  డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో దంత వైద్య సేవలు అందించడానికి టీడీఎస్‌ఎ ముందుకురావడం అభినందనీయ మని అన్నారు. గతంలో టీడీఎస్‌ఎ సంఘ ఆవిష్కరణ తన చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిందని, ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షనీయమని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యేను, సర్పంచులను వైద్య సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్ డా.మణిదీప్ బలుసాని, బెజ్జూర్ ప్రాథమిక ఆసుపత్రి డా.శ్రావణ్ కుమార్, డా.శ్రీనివాస్, డా.కీర్తి, సెక్రటరీ డా.సామల రసజ్ఞ, డా. హర్షిని, డా.సౌమ్య, డా.షఫియా, సర్పంచ్లు దుర్గం సరోజ తిరుపతి, కుమ్మరి రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ గూడ రాకేష్, వషి ఉల్లా ఖాన్, మండల అధ్యక్షులు జాడి తిరుపతి, మాజీ ఎంపిపి కోండ్ర మనోహర్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.