calender_icon.png 17 January, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు ఉద్యోగం.. మాకు భావోద్వేగం!

17-01-2026 02:02:43 AM

  1. విద్య మన జీవితాలకు వెలుగు
  2. గతంలో పంచడానికి భూములు ఉండేవి ఇప్పుడు లేవు..
  3. విద్య మాత్రమే అందించడానికి అవకాశం 
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ 
  5.   1,370 మంది గ్రూప్-3 ఉద్యోగులకు నియామకాల పత్రాలు అందజేత

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : మీకు ఉద్యోగం.. మాకు భావో ద్వేగం.. ఉద్యోగాలు ఇవ్వడం మాకు బాధ్య త.. మీకు జీవితం. ప్రభుత్వ ఉద్యోగం అం టేనే జీతం తీసుకోవడం కాదు.. ఒక భావోద్వేగం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. అందరికీ విద్య అందుతోందని.. కానీ, నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలల మీద ప్రజలకు ఎందుకు విశ్వాసం పెరిగిందని సీఎం ప్రశ్నించారు. ఉచితంగా విద్యను అందజేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు రావడం లేదని, నాణ్యమైన విద్యను అందిస్తే.. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తారు’ అని సీఎం పేర్కొన్నారు.

గ్రూప్-3 కింద వివిధ శాఖలకు సంబంధించి 1,370 మం ది ఉద్యోగులకు నియామక పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శిల్పకళావేదికలో అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ విద్య ఒక్కటే పేదరికాన్ని పోగొడుతుందన్నారు. తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఎందుకు ప్రైవేట్‌లో చదివిస్తున్నారని, మనం నాణ్యమైన విద్యను అందిస్తే.. పేరెం ట్స్ ప్రైవేట్ స్కూల్స్‌కి ఎందుకు పంపుతారని అన్నారు. ఈ రోజు పంచి పెట్టడానికి పోడుభూములు, అసైన్డ్ భూములు లేవని.. ఉన్న ది ఒక్కటే.. నాణ్యమైన విద్యను అందించడమే’ అని అన్నారు.

రాష్ర్టంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అదే సమయంలో 11 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉం టే.. అందులో 33 లక్షల విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. లక్షల మంది ఇంజి నీరింగ్ చేసి బయటకు వస్తున్నా.. అందరికీ ఎందుకు ఉద్యోగాలు రావడం లేదని ప్రశ్నించారు. జాబ్ మార్కెట్‌లో అవకాశాలు ఉన్నా స్కిల్స్ లేక అందుకోలేకపోతున్నామని, నైపుణ్యాభివృద్ధి కోసం యువత ప్రయత్నించా లని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు పేదరికం పోగొట్టుకోవడానికి భూములు ఇచ్చేవాళ్లమ ని.. ఇప్పుడు ఇవ్వడానికి భూములు లేవని, నైపుణ్యమైన విద్యను మాత్రమే అందించగలమని అన్నారు. విద్య ఒక్కటే పేదరి కాన్ని పోగొడుతుందని, విద్యతోనే గౌరవమని తెలిపారు. కులం, డబ్బు, అధికారంతో గౌరవం రాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తామ ని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల మంది దరఖాస్తు 

‘గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల మంది అప్లు చేశారు. ప్రజాప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పనిచేస్తోంది.  ప్రభు త్వం రాగానే యూపీఎస్‌సీతో పోటీపడేలా టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేశాం. గతం లో ఆర్‌ఎంపీ, డిప్యూటీ ఎంఆర్‌వో, విశ్రాంత టీచర్లను టీజీపీఎస్‌లో పెట్టారు. మేం విద్యావంతులతో నియమించాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం. పదేళ్లు యువత ఆంకాక్షలు నెరవేరలేదు. పదేళ్లు నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలేదు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. తెలంగాణ రాష్ర్టం వచ్చాక ఉద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అంతా భావించారు.

ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించాం. రెండేళ్లలో 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. నియామక పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించాం. పార్టీ ప్రయోజనాలు, స్వప్రయోజనాలకే బీఆర్‌ఎస్ ప్రా ధాన్యత ఇచ్చింది. ఓపిక నశించిన యువత.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు. మీకు ఉద్యోగం ఇవ్వడం మా బాధ్యత కావచ్చు. కానీ ఉద్యోగం మీ జీవితం. రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయి. దాదాపు పదిన్నర లక్షల మంది ప్రభుత్వంతో పనిచేస్తున్నారు.

విద్యా, ఉద్యోగం, వ్యవసాయం ముఖ్యమని ఆనాడు నెహ్రూ అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్సారెస్పీల వల్లే తాగునీటి సమస్యలు లేవు. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో బురదమట్టి తిని బతికిన రోజులున్నయ్. దేశంలోనే తెలంగాణ అత్యధికంగా వరిని పండిస్తున్నది. దేశంలో ఆహార ధాన్యాలకు లోటు లేదు.. కానీ ప్రోటీన్ ఫుడ్ అందటం లేదు. పతీ ఏటా లక్షా 10 వేల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ..

ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారని, గత ప్రభుత్వ  పదేళ్ల హయాంలో ఉద్యోగాల భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సొంత లాభమే చూసుకుందని, యువత, నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రధానంగా గత సర్కార్ పనిచేసిందని ఆరోపించారు. వారి ఉద్యోగాలు ఊడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని గుర్తుచేశారు. 14 ఏళ్ల పాటు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదని అన్నారు.

పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యమైతే.. పేపర్లు లీక్ అవ్వడం మరో బాధ్యతారాహిత్యమని ఫైర్ అయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయతను కూడా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రూప్-1 నియామక పత్రాలు ఇచ్చే సమయంలో కూడా కోర్టుకు వెళ్లి కుట్రలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు.