17-01-2026 02:17:41 AM
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ముందుగా మెట్రో మొదటి దశను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ర్ట ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి శుక్రవారం లేఖ రా శారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీ కరించిందని కూడా కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గుర్తు చేశారని అన్నారు.
మెట్రో మొదటి దశను రాష్ర్ట ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నుంచి తీసుకోవడం, రెండో దశకు సన్నాహాలు కోసం కేంద్ర, రాష్ర్ట ప్ర భుత్వాలు కలిసి సంయుక్తంగా కమిటీ ఏ ర్పాటు చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నిర్ణయించారని కూడా కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తనకు తెలిపారని పేర్కొన్నారు. లేఖ ద్వారా కిషన్‌రెడ్డి స్పంది స్తూ... ‘తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రవాణా సౌకర్యాలను మెరుగుప రచ డంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన విషయం తెలిసిందే.
ఇప్పటికే అమలు జరుగుతున్న మొదటి దశ మెట్రోను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహిస్తుందని మీరు ప్రకటించారు. నేను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మం త్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించాను. ముందుగా మెట్రో మొదటి దశను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసు కోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలని చెప్పా రు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’అని చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేం ద్ర ప్రభుత్వం తరఫున మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినట్లు కూడా వివరించారు. కానీ, ఇంతవరకు రాష్ర్ట ప్రభుత్వం అధికారుల పేర్లను ఎందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు. కావున సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నం చేయాలని సూచించారు. దీంతోపాటు వేగవంతంగా ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో నెట్‌వర్క్‌ను రాష్ర్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కా వాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.