calender_icon.png 17 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతల్లో ఉత్కంఠ

17-01-2026 01:25:47 AM

  1. నేడు తేలనున్న బల్దియా రిజర్వేషన్లు 
  2. కరీంనగర్ కార్పొరేషన్ జనరల్ మహిళ..?

కరీంనగర్, జనవరి 16 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా నేడు(ఈ నెల 17న) ఏయే స్థానాలను ఏయే వర్గాలకు కేటాయిస్తారో తేలనుందో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 13 మున్సిపాలిటీలు ఉండగా, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. 10 కార్పొరేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి కేటాయించారు. బీసీ వర్గా లకు మూడు కేటాయించగా, రెండు జనరల్, ఒక మహిళకు కేటాయించారు.

ఆన్ రిజర్వ్ విభాగాల్లో ఐదు నగరాలను కేటాయించగా అందులో నాలుగు నగరాలకు మహిళలకు కేటాయించారు. ఈ క్రమంలో గతంలో జనరల్ గా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 121 ము న్సిపాలిటీలు ఉండగా అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉ న్నాయి. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థా నాలు కేటాయించారు. జనరల్ స్థానాలు 61 కాగా అందులో 31 మహిళలకు కేటాయించారు.

జిల్లాల వారీగా డివిజన్లు.. వార్డులు..

కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా ఎస్టీ జనరల్ కు ఒక డివిజన్ కేటాయించారు. ఎస్సీలకు ఏడు స్థానాలు కేటా యించగా, జనరల్ నాలుగు, మహిళలకు మూడు కేటాయించారు. బీసీలకు 25 డివిజ న్లు కేటాయించగా 13 జనరల్, 12 మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాలు 33 కాగా 18 జనరల్, 15 మహిళలకు కేటాయించారు. రామగుండం కార్పొరేషన్లో 60 డి విజన్లు ఉండగా ఎస్టీలకు ఒక స్థానం కేటాయించగా, ఎస్సీలకు 13 స్థానాలు కేటా యించారు. ఇందులో ఏడు జనరల్, ఆరు మహిళలకు కేటాయించారు. బీసీలకు 16 స్థానాలు కేటాయించగా 8 జనరల్, 8 మహిళలకు కేటాయించారు. 30 జనరల్ స్థానా ల్లో మహిళలకు 14 స్థానాలు కేటాయించా రు.

జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 12 వార్డులు ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, ఒకటి మహిళ, ఒకటి జనరల్, బీసీలకు నాలుగు రెండు జనరల్, రెండు మ హిళ, జనరల్ కు 8 కేటాయించగా అందులో నాలుగు మహిళలకు కేటాయించారు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉం డగా ఒకటి ఎస్టీకి కేటాయించారు. నాలుగు ఎస్సీలలో రెండు జనరల్, రెండు మహిళల కు కేటాయించారు. బీసీలకు 20 స్థానాలు కేటాయించగా అందులో 10 జనరల్, 10 మహిళలకు కేటాయించారు. జనరల్ 25లో 13 మహిళలకు కేటాయించారు. కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా ఒక టి ఎస్టీ జనరల్, మూడు ఎస్సీలలో ఒక టి మహిళకు, 12 బీసీలలో 6 స్థానాలు మ హిళలకు, 17 జనరల్ స్థానాల్లో 9 స్థానాలు మ హిళలకు కేటాయించారు.

మెట్పల్లిలో 26 వార్డులు ఉండగా ఒకటి ఎస్టీ జనరల్, మూ డు ఎస్సీలకు కేటాయించారు. ఇందులో ఒక టి ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 9 స్థానాలు ఉండగా 4 మహిళలకు కేటాయించారు. జనరల్ 13 ఉండగా మహిళలకు 8 స్థానాలు రిజర్వ్ చేశారు. రాయికల్లో 12 వార్డులకుగాను ఒకటి ఎస్టీ, ఒకటి ఎస్సీ జనరల్ కు కేటాయించారు. బీసీలకు 4 వార్డులు కేటాయించగా 2 మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ 6 స్థానాల్లో నాలుగు మహిళలకు కేటాయించారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో 14 వార్డులు ఉండగా ఒకటి ఎస్టీ జనరల్కు, మూడు ఎస్సీలలో ఒకటి మహిళకు, మూడు బీసీలలో ఒకటి మహిళకు, జనరల్ 7 స్థానాలు కాగా 5 మహిళలకు కే టాయించారు. హుజూరాబాద్లో 30 వా ర్డులు ఉండగా ఒకటి ఎస్టీ, ఆరు ఎస్సీలకు కే టాయించగా ఇందులో 3 మహిళలకు కేటాయించారు. బీసీలకు 8 కేటాయించగా 4 మహిళలకు కేటాయించారు.

జనరల్ 15 కాగా ఇందులో 8 మహిళలకు కేటాయించా రు. జమ్మికుంటలో 30 వార్డులు ఉండగా ఒకటి ఎస్టీ జనరల్, ఎస్సీలకు 6 కేటాయించగా మూడు మహిళలకు, బీసీలకు 8కు గా ను నాలుగు మహిళలకు, జనరల్లో 15 కుగా 8 స్థానాలు మహిళలకు కేటాయించారు. మంథని మున్సిపాలిటీలో 13 వార్డులు ఉం డగా ఒకటి ఎస్టీ జనరల్కు, ఎస్సీలకు రెండు స్థానాల్లో ఒకటి మహిళకు, బీసీలకు 3 స్థా నాలు కేటాయించగా ఒకటి మహిళకు కేటాయించారు. జనరల్లో 7 స్థానాలకుగాను 4 వార్డులు మహిళలకు కేటాయించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా ఒకటి ఎస్టీకి, నాలుగు ఎస్సీలకు కేటాయించారు. ఇందులో ఎస్సీ మహిళకు రెండు, బీసీలకు 13 స్థానాలకుగా 7 మహిళలకు కేటాయించారు.

18 జనరల్ స్థానాల్లో 10 మహిళలకు కేటాయించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా ఒక టి ఎస్టీ, రెండు 2 ఎస్సీలలో ఒకటి మహిళకు, బీసీలకు 4 స్థానాలలో 2 మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాలకు 8 కిగాను 4 మహిళలకు కేటాయించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా ఎస్టీలకు ఒకటి కేటాయించారు. ఎస్సీలకు 3కుగాను ఒకటి మ హిళకు రిజర్వ్ చేశారు. 15 బీసీలలో 7 మహిళలకు కేటాయించారు. జనరల్ స్థానాలు 20 కాగా 11 మహిళలకు కేటాయించారు. వేములవాడ మున్సిపాలిటలో 28 వార్డులు ఉండ గా ఒకటి ఎస్టీకి, నాలుగు ఎస్సీలలో రెండు మహిళలకు కేటాయించారు. బీసీలకు 9 స్థానాలలో నాలుగు మహిళలకు కేటాయించారు. జనరల్ 14 స్థానాలకుగాను 8 వార్డు లు మహిళలకు రిజర్వ్ చేశారు. వీటికి సం బంధించి రిజర్వేషన్లు ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ అన్నది నేడు తేలనున్నది.