06-10-2025 01:19:07 AM
తాడ్వాయి, అక్టోబర్, 5( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది మూడు గంటల పాటు వర్షం భారీగా కురవడం తో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. మండలంలోని సంతాయిపేట భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహించింది.
ఎర్ర పహాడ్ పెద్దవాగు, నందివాడ పిల్ల ఒర్రె వాగు, బ్రాహ్మణపల్లి వాగు, కాలోజివాడి వాగు, కన్కల్ వాగు లు పొంగి ప్రవహించాయి వర్షం భారీగా కురవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షం భారీగా కురవడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.