06-10-2025 01:20:18 AM
మద్నూర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి):కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే జడ్పిటిసి గా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని మద్నూర్ మండలానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ రావ్ పటేల్ అన్నారు. పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి ప్రజలు ఆశీర్వాదిస్తే బిజెపి పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
గతంలో రాజకీయంగా ఎంపీటీసీగా సొసైటీ చైర్మన్ గా 25 సంవత్సరాలుగా సుధీర్గ అనుభవం మండల రాజకీయంలో పట్టు ఉన్న తనను అధిష్టానం అవకాశం కల్పించాలని కోరారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో తను ఇన్చార్జి ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో బిజెపికి భారీ మెజారిటీ తీసుకొచ్చానని తప్పకుండా జడ్పీటీసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసేందుకు శాయశక్తుల్లా కృషి చేస్తానని ఆయన తెలిపారు.