calender_icon.png 13 September, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు రోజులు భారీ వానలు

27-08-2024 12:16:37 AM

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో ఆరు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కు్ర మంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.