01-09-2025 01:27:06 AM
-వాతావరణ కేంద్రం అంచనా
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అంచనా వేసింది. కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ విడుదల చేసింది. అలాగే ఈ నెల 4వ తేదీ వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.