28-10-2025 01:25:32 AM
హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిం ది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ క ర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లా ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షా లు కురుస్తాయని అంచనా వేసింది. బుధవా రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్, ములుగు జిల్లాల్లో అతిభారీ, మిగతా చోట్ల ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది. ఈనెల 31 వరకు రాష్ట్రంలో వర్షా లు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.