28-10-2025 01:28:11 AM
నేటి నుంచి నవంబర్1 వరకు దరఖాస్తులు
డిసెంబర్ 1 నుంచి కొత్తవారికి వైన్‌షాపులు
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : తెలంగాణలో మద్యం షాపుల ల క్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. లిక్కర్ షా పుల డ్రాలో చిత్ర విచిత్రాలు చోటు చోసుకున్నాయి. షాపులు దక్కిన వారు సంతోషంగా ఉంటే, షాపులు దక్కని వారు అసంతృప్తితో వెనుతిరిగారు. అయితే కొందరికి ఒక్క షాపు కూడా దక్కలేదు. కొందరికి మాత్రం ఒకే ఇంట్లో ముగ్గురికి, మరొకచోట ఒక్కరి పేరు మీదనే రెండు, మూడు షాపులు దక్కాయి.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఒక కుటుంబానికి అదృష్టం వరించింది. భార్యాభర్తలిద్దరూ లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్నారు. అంతే కాకుండా తమ అనుచరుడి పేరుతో వేసిన దరఖాస్తుకూ లిక్కర్‌షాపు వరించింది. అయితే రాష్ట్రంలోని 2,620 మద్యంషాపులకు సోమవారం 2,601 షాపులకే డ్రా తీశారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన 19షాపులకు మళ్లీ నో టిఫి కేషన్ ఇవ్వాలని అబ్కారీశాఖ నిర్ణయం తీసుకున్నది.
వాటికి మంగళవారం నోటిఫి కేషన్‌తో పాటు దరఖాస్తులను స్వీకరించాల ని, నవంబర్1 వరకు దరఖాస్తులు తీసుకుని, 3న డ్రాతీయాలని నిర్ణయించింది. అదిలాబాద్ అసిఫాబాద్ జయశంకర్ భూ పాలపల్లి శంషాబాద్ సంగారెనడ్డి లిక్కర్‌షాపులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. డ్రాలో షాప్‌లను దక్కించుకున్న డి సెంబర్1 నుంచి షాపులు అప్పగించనున్నారు.