28-05-2025 12:39:42 AM
-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): తెలంగాణలో అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాను న్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 29న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో, ఈ నెల 30న జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు, విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిం చారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు.