calender_icon.png 29 May, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి

28-05-2025 12:38:34 AM

సీఐటీయు జిల్లా కార్యదర్శి బండమీది బాల్ రాం

నారాయణపేట. మే 27(విజయక్రాంతి): ప్రభుత్వ హాస్టల్లో పనిచేస్తున్న కుక్కింగ్, స్వీపింగ్ ,కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు గత 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని కో రుతూ నారాయణపేట జిల్లా కలెక్టరేట్  ఎఓ  జయసుధకు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారము రోజు  వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బండ మీది బలరాం  మాట్లాడుతూ ఇచ్చే వేతనం అర కొరవేతనము అది కూడా 6 నెలలుగా పెండిం గ్లో ఉండడం కారణంగా కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల కూడా ప్రతి నెల ఒకటో తారీకు రోజుని వేతనాలు అందివ్వాలని ఏఓ  జయసుధ దృష్టికి తీసుకెళ్లారు.కార్మికుల ఖాతాల లో పిఎఫ్ రెగ్యులర్గా జమ కావడం లేదని తెలిపారు.

ఈఎస్‌ఐ కారడ్స్ ఇప్పటివరకు జారీ చేయలేదన్నారు.కాంటాక్ట్ అవుట్సోర్సింగ్  ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 25వేల రూపాయలు చెల్లించాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన జయసుధ  స్పందిస్తూ అదనపు కలెక్టర్ గంగ్వార్  దృష్టికి తీసుకెళ్తాని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ మడివాల్ ఆర్ లక్ష్మమ్మ ,మహేశ్వరి, లక్ష్మి, రాజేశ్వరి ,రాము తదితరులు పాల్గొన్నారు.