27-01-2026 12:00:00 AM
భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహిస్తాం ఏసీపీ మడత రమేష్
గోదావరిఖని జనవరి 26 (విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో గోదావరి ఒడ్డున నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను భారీ బందోబస్తు మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. సోమవారం గోదావరిఖని లో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల ను 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2-టౌన్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు లతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, సిపి సూచనల మేరకు, సింగరేణి జిఎం లలిత్ కుమార్ సహకారంతో జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామని, పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశామని, భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేశామని ఏసిపి తెలిపారు.