calender_icon.png 27 January, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

27-01-2026 12:00:00 AM

ముకరంపుర, జనవరి 26 (విజయ క్రాంతి): నగరంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సోమవారం గణ తంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించా రు.  ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై జాతీయ నా యకుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైనదని, అభివృద్ధికి నాంది అని అన్నారు.

అనంతరం పలు ప్రతిభ పాటవ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.  విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.